సాధారణంగా కంది పంటను ఖరీఫ్‌లో వర్షం ఆధారంగా పండిస్తారు. అయితే పూత దశలో ఒకటి లేదా రెండు సార్లు నీటి తడి అందిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇక రబీలో రెండు లేదా మూడు సార్లు కంది పంటకు నీటి తడి అందించాలి. మొగ్గ వచ్చే దశ ముందు ఒకసారి, పిందె దశలో ఉన్నప్పడు మరోసారి నీటి తడి అందించాలి. అధిక నీరు లేదా బెట్టకు గురైతే కంది పంట పూత, కాత రాలిపోతుంది.