వర్దన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలోని ఏరియా అస్పత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అస్పత్రిలోని రికార్డులను, రిజిస్టర్ ను పరిశీలించిన ఎంపీ పేషెంట్ల నమోదు, ప్రసవాలు, రక్త పరీక్షలు వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభలుతున్న సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు.