గ్రామ పంచాయతీల వారీగా తయారుచేసిన ముసాయిదా ఓటరు జాబితాలను శుక్రవారం గ్రామ పంచాయతీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నట్లు వరంగల్ జిల్లా ఇన్చార్జ్ డీపీఓ రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 14 నుంచి 21వ తేదీ వరకు అధికారులకు అందజేయాలని ఆయన సూచించారు.