కాజీపేట మండలం మడికొండలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం సైబర్ నేరాల పట్ల డయల్ 100 అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, మల్లిక, జ్యోతి, మల్లారెడ్డి, ఏఎస్ఐ నాగరాణి, హెడ్ కానిస్టేబుల్ జయరాజ్, గోవర్ధన్, రాజు పాల్గొన్నారు.