వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ తో కలిసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం రైతులు నష్టపోకుండా పత్తి లోని తేమ శాతాన్ని నిర్వహించేందుకు ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు.