హనుమకొండ: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు

74பார்த்தது
ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని హనుమకొండ రెవెన్యూ అధికారి గణేష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో యువత మత్తు పదార్థాల నియంత్రణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు వివరించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో తమ కుటుంబీకుల బాధ్యత కీలకం అని అన్నారు.

தொடர்புடைய செய்தி