కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాంనగర్ సుందరయ్య భవన్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కొమురం భీమ్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ధూడపాక రాజేంద్ర అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథి గా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ హాజరై మాట్లాడుతూ కొమురం భీం జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.