సమస్యలను పరిష్కరించాలని 73 దరఖాస్తుల అందజేత

58பார்த்தது
హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలను అందజేయగా ఆదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని 73 దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్, సిపిఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி