వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని గురువారం ప్రముఖ తెలుగు చిత్ర హీరో గోపీచంద్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన గోపీచంద్ కు ఆలయ సహాయ కమీషనర్, ఈఓ శేషుభారతి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు మహదాశీర్వచనం నిర్వహించి, అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదములు అందజేశారు.