హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం జి24 లో ప్రత్రి రోజు మధ్యాహ్నం 1 నుండి 2. 30 గంటల వరకు లంచ్ పేరుతో ఉద్యోగులు బయటకు వెళ్ళే క్రమంలో, తమ కార్యాలయంలోని లైట్లు, ఫ్యాన్లు బందు చేయకుండా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్యాలయంలో ఖాళీ కుర్చీలు, తిరుగుతున్న ఫ్యాన్లు, వేసి ఉన్న లైట్లు, ఆఫ్ చేయకుండా ఉద్యోగులు బయటకు వెళ్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయం అని ధీమా కావచ్చని అంటున్నారు.