పర్వతగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు మోడల్ స్కూల్ ను వరంగల్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎం సృజన్ తేజ మంగళవారం సందర్శించడం జరిగింది. ఉపాధ్యాయుల బోధనను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.