వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. ఎంజీఎం ఆస్పత్రి మొదటి గేటు ఎదుట మృతదేహం ఉన్నట్లు మట్టెవాడ పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు సుమారు 50 ఏళ్ల వయసు కలిగి నల్లని జుట్టు, గడ్డం ఆరెంజ్ రంగు, వైట్ కలర్ షర్ట్, నల్ల కలర్ పాయింట్ ధరించినట్లు పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు.