విశేష్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం వరంగల్ జిల్లాకి విచ్చేసిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం వరంగల్లో ప్రముఖులను కలిసి సభ్యత్వ నమోదు చేపించారు. శివనగర్, చింతల్ ప్రాంతాల్లో, లేబర్ కాలనీలో పలువురిని కలిసి బీజేపీ సభ్యత్వ నమోదులు చేయించారు. అలాగే సభ్యత్వ నమోదు గురించి మాట్లాడుతూ గణాంకాలు, అంకెలు కాదని.. పూర్తి స్థాయి సైద్ధాంతిక ఉద్యమం అన్నారు.