260 క్వింటాళ్ల బియ్యం పట్టివేత

70பார்த்தது
అక్రమంగా లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. నల్లబెల్లి మండలంలోని రంగాపురం, రేలకుంట, నందిగామ కలిసే కూడలి వద్ద తనఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఆయా గ్రామాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 260 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న బియ్యం విలువ రూ. 6, 76, 000 ఉంటుందని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி