భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన గడిపె సంపత్, స్వర్ణ ల కుమార్తె అస్మిక (3) ఆదివారం ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టి లో పడి మృతి చెందింది.చిన్నారి తల్లిదండ్రులు ఆదివారం కావడం తో అన్నయ్య దగ్గర వదిలి కూలి పనులకు వెళ్లారు. కాసేపటి తర్వాత తన చెల్లెలు కనిపించట్లేదని వెతుకుతుండగా ఆ చిన్నారి నీటి తొట్టి లో పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆసుపత్రి కి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.