ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

4911பார்த்தது
ప్రేమించి మోసం చేశాడని వరంగల్ నగరంలోని బట్టల బజార్లో ప్రియుడి ఇంటి ముందు కొడకండ్లకు చెందిన ఓ యువతి బైఠాయించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఓ బట్టల షాప్ యజమాని కొడుకు పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడని యువతి ఆరోపించింది. మూడేళ్లు కలిసి ఉండి, రెండు సార్లు అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేసేవరకు వెళ్ళేది లేదని బైటాయించింది.

தொடர்புடைய செய்தி