స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. సాగు నీటి సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులతో చర్చించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండాఎగరాలని పిలుపునిచ్చారు.