చిల్పూర్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్ లోని సభ్యుల వివరాలు సేకరించి పోలీస్ లు అరెస్ట్ చేయడం అన్యాయమని అప్రజాస్వామికమైన చర్యగా చిల్పూర్ మండలం సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ అన్నారు. గ్రూపులో ఉన్న రైతులను రాత్రికి రాత్రే ఇండ్ల మీద పడి అరెస్ట్ చేశారు. గురువారం రుణమాఫీ కాని రైతులు ఛలో ప్రజాభవన్ ముట్టడికి తరలి రావాలనే గ్రూప్ కి సంబంధం లేని వ్యకి పిలుపునివ్వడంతో అరెస్ట్ చేశారన్నారు.