హనుమకొండ జిల్లా పరకాల మండలం రాజిపేట వద్ద సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం కోసం గుర్తించిన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం కోసం అధికారులు 19 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించగా ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను ఆర్డీవో ని అడిగి తెలుసుకున్నారు.