తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఇంటింటి కుటుంబ కులగణన సర్వేతో పాటు, రాష్ట్రంలో చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకొని పోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గీసుగొండ మండలంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన కార్యక్రమం ఉంటుందన్నారు.