ఎస్సారెస్పీ కాల్వ మట్టి తవ్వకాన్ని అడ్డు కున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంగెం ఎస్సై నరేశ్ తెలిపారు. షాపురం పరిధి ఎస్సారెస్పీ కాల్వ భూమిలో మైనింగ్ అనుమతులతో టెక్స్టైల్ పార్కులోని కీటెక్స్ కంపెనీకి మట్టిని తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన పేరాల దిలీప్రోవు, పేరాల సమ్మారావు, దొనికెల శ్రీనివాస్ తమ గ్రామ పరిధిలోని మట్టి ఎలా తరలిస్తున్నారని అడ్డుకున్నారు.