రాయపర్తి మండలం ఊకల్ గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించగా, వారి కుటుంబాన్ని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం పరామర్శించి, ఆ కుటుంబానికి 50 కిలోల బియ్యం, వంటనూనెను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు మహేందర్ రెడ్డి, ఎండి యూసుఫ్ పాషా, లక్ష్మీ, సోమక్క, రాములు, తదితరులు పాల్గొన్నారు.