జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ గీత కార్మికులకు రక్షణ కిట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.