నర్సంపేట: ప్రత్యేక కమిషన్ ద్వారానే బీసీ కులగణ చేపట్టాలి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణనను హైకోర్టు సూచించిన విధంగా ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసిన తర్వాతనే చేపట్టాలని కోరారు. బీసీ కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వే చేపడుతుందని అన్నారు.