TG: మాజీ సర్పంచులను అరెస్టులు చేయడాన్నిమాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. మాజీ సర్పంచులకు మద్దతుగా హైదరాబాద్‌లోని తిరుమలగిరి పీఎస్ ముందు సోమవారం హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని అన్నారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు.