వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్ మెంట్, అధ్యాపక బృందం గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ని క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గత మూడు సంవత్సరాల నుంచి బకాయి ఉన్న కళాశాల ఫీజు బకాయిలను వెంటనే విడుదలయ్యే విధంగా కృషి చేయాలని ప్రైవేట్ మేనేజ్మెంట్ పక్షాన వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.