బీజేపీతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాపరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లాలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ సభ్యత్వ నమోదులో నర్సంపేట నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చూపిస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.