చివరి దశలో ఉన్న వరిపంటకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి బాల్నే జగన్ వరంగల్ జిల్లా నర్సంపేటలోని జాలుబందం కాలువను పరిశీలించారు. జాలు బంధం కాలువ, పసునూరు కాల్వ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు రాక ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితి ఆదికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరారు.