టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయన్న వాదనలో నిజం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, టమాటాల్లో ఉండే ఆక్సలేట్ అనే పదార్థం కారణంగా ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్న వారికి ప్రమాదమట. దీని వల్ల మళ్లీ రాళ్లు ఏర్పడతాయి. కానీ టమాటాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. టమాటాలే కాకుండా, బీట్ రూట్, బచ్చలి కూర, పలు గింజల్లో కూడా ఆక్సలేట్ ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు వీటిని కాస్త తక్కువగా తింటే మంచిది.