వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోపాకుల చెరువులో వంద శాతం రాయితీతో అందించే ఉచిత చేప పిల్లల కార్యక్రమాన్ని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ప్రారంభించారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ప్రభుత్వ అందించిన చేప పిల్లలతో వారు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ముదిరాజులు ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు.