వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం మాలమహానాడు మండల అధ్యక్షులు ఈద విజేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు ఎస్సీలను వర్గీకరించుకోవచ్చని ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగ విరుద్ధమని దళితుల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ మాల మాదిగలను విడగొట్టడానికి కుట్రలు పన్నుతున్నారని అన్నారు.