నల్లబెల్లి: వృద్ధుల పెన్షన్లో పన్నుల పేరుతో కోత

82பார்த்தது
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో బుధవారం వృద్దులకు ఇచ్చిన పెన్షన్ల నుంచి గ్రామపంచాయతీ అధికారులు ఇంటి, నల్లా పన్నులు వసూలు చేశారు. పండగ పూట వృద్ధులకు డబ్బులు ఇచ్చి పెన్షన్లో కోత విధించడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మూడు నెలలు సమయమున్నా ఇప్పుడే పన్నులు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ కొడుకుల దగ్గర వసూలు చేసుకోమని విన్నవించినా వినలేదన్నారు.

தொடர்புடைய செய்தி