వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందని తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. బంధువులు తెలిపిన వివరాలు.. ములుగు జిల్లాకు చెందిన కవిత-జైపాల్ దంపతుల కూతురు వర్షిత(8)డెంగ్యూతో బాధపడుతుండగా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వర్షిత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఈక్రమంలో వైద్యుడి కారును ధ్వంసం చేశారు.