తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సోమవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1323. 86 కిలోమీటర్ల మేర కొత్త రహదారులకు రూ. 1377. 66 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నూతన రోడ్డు నిర్మాణం తో రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని తెలిపారు.