ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం బీఎస్ఎన్ఎల్ టవర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ఏడాది గడిచినా సిగ్నల్ లేని కారణంగా నిరుపయోగంగా వుంది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కొండాయి లో ఎనిమిది మంది మృత్యువాత పడి చనిపోవడానికి, సమయానికి సమాచారం అందక పోవడమే కారణమని స్థానికులు తెలిపారు. తక్షణమే సెల్ ఫోన్ టవర్ కి సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.