ములుగు జిల్లా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం వాజేడు మండలంలో పర్యటించారు. గ్రామపంచాయతీలలో సభలు నిర్వహించి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాలపై ఆరా తీశారు.