ములుగు జిల్లా రామప్ప పర్యటనపై బుధవారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. రామప్పలో రూ. 90 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా యంత్రాంగం ద్వారా మంత్రి జూపల్లి కృష్ణారావుకు నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. 14 ఏళ్ల క్రితం లక్నవరంలో ఏర్పాటు చేసిన ఉయ్యాల వంతెన పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తోందన్నారు. అదే తరహాలో రామప్ప సరస్సులో ఉయ్యాల వంతెన ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లిని కోరానని తెలిపారు.