ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు శివారులో గిరిజనులు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ, పోలీసు అధికారులు జేసిబి ద్వారా కూల్చివేశారు. కొన్ని సంవత్సరాలుగా సుమారు 150 మంది గిరిజనులు అటవీ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కాగా పలుమార్లు అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ గిరిజనులు వెళ్లకపోవడంతో సోమవారం కూల్చివేసి, సామగ్రిని బయట పడేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు.