ములుగు ఆస్పత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్

67பார்த்தது
ములుగు ఆస్పత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య శాఖ డైరెక్టర్
ములుగు జిల్లా ప్రధాన ఆస్పత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల వద్దకు వెళ్లి వారి అవస్థలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. వారికి డాక్టర్లు అందించిన వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం పీడియాట్రిక్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ తదితర వార్డులను తిరిగి రోగుల వద్ద నుండి వివరాలను సేకరించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி