ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబర్ లోపు పూర్తి చేయాలని శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ. నాణ్యత ప్రమాణాలు లోపించకుండా నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం ముగుస్తున్నందున వర్కర్లను పెంచి బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, మెట్లు, తదితర పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. రోజుకు 2 సార్లు వాటర్ క్యూరింగ్ చేయాలని సూచించారు.