ములుగు జిల్లా మేడారం సమ్మక్క తల్లి కొలువైన చిలుకలగుట్ట చుట్టు పూజలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం వస్తే అర్ధరాత్రి వేళలో ముగ్గులు వేసి, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, వివిధ రకాల వస్తువులతో పూజలు నిర్వహిస్తున్నారని స్థానిక పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. చిలకలగుట్ట చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.