ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పెరుకపల్లిలో దారుణం జరిగింది. పెరుకపల్లికి చెందిన వితంతు మహిళపై ఇదే గ్రామానికి చెందిన శివ కుమార్ అత్యాచారం చేసినట్టు బాధిత కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా 2 రోజులైన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు పెరికపల్లి గ్రామస్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు.