ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ తో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం 2024 - 25 ధాన్యం సేకరణ, అలాగే కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో పలు మార్పులు తీసుకు వచ్చిందని అన్నారు. ధాన్యం సేకరణకు సహకరించాలని, అలాగే ధాన్యం డెలివరీ చేయడంలో సిఎంఆర్ పై సహకారం అందించాలన్నారు.