విజయానికి చిహ్నమైన విజయదశమిని ములుగు జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలందరూ ఒకరినొకరు కలుసుకొని సుఖసంతోషాలతో శమీ పూజ నిర్వహించి ఐకమత్యంగా పండుగను జరుపుకోవాలన్నారు. సుఖసంతోషాలతో ఉండేలా ఆ దుర్గాదేవి అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.