దివ్యాంగులకు చేయూతనివ్వడం మనందరి బాధ్యత అని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలింకో హైదరాబాద్ సహకారంతో బుధవారం ఏర్పాటు చేసిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా వివిధ రకాలైన దివ్యాంగులకు, వారికి అవసరమైన పలు రకాల సహాయ ఉపకరణాలను గుర్తించడం జరుగుతుందన్నారు.