ర్యాగింగ్ కు పాల్పడినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం నేరమని ములుగు డీఎస్పీ రవీందర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో పాఠశాలలు, కళాశాలల్లో ర్యాగింగ్ పై గురువారం అవగాహన కల్పించారు. డిఎస్పీ రవీందర్ మాట్లాడుతూ. ర్యాగింగ్ వ్యతిరేక ప్రచారంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే 8712670120 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.