ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి లో ఇసుక క్వారీ పనులను మంగళవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఏడాది ఇసుక క్వారీ కారణంగా దొడ్ల - మాల్యాల బ్రిడ్జి కూలిపోయి రవాణా స్తంభించింది. గ్రామంలో పెద్ద ఎత్తున పంటలు, ఎనిమిది ప్రాణాలు నష్టపోవాల్సి వచ్చిందని గ్రామాన్ని ముంచే ఇసుక క్వారీ పనులు వెంటనే నిలిపివేయాలని కోరారు. ఐటీడీఏ పీఓ, తహశీల్దార్ లకు కొండాయి గ్రామస్తులు వినతి పత్రాన్ని అందజేశారు.