ములుగు కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

67பார்த்தது
ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు వెంకట్రాములు హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ రూ. 2 లక్షల లోపు రుణ మాఫీ చేయాలని అన్నారు. లేదంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி