ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై సమక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తుల రాకతో గద్దెల పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.