మీడియా, పోలీసులం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన పల్ల రాంబాబు, పల్నాటి సతీశ్, వద్ది కార్తీక్, మల్లెల కమలాకర్, వావిలాల జనార్ధన్, తాడూరు మధుకర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వాజేడు ఎస్సై హరీశ్ తెలిపారు. వాజేడు మండలం అయ్యవారిపేట నుండి ఏటూరునాగారం వెళ్తున్న డిసిఎంను ఆపి రూ. 20వేలు ఇవ్వాలంటూ బెదిరించారని అన్నారు. డిసిఎం ఓనర్ సద్దాం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.